;

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

news

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* 

*ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే*

*బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు*

*బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* 

    ఏప్రిల్ ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా మొదలుకానున్న జాతి 

జనగణన లో బీసీ కులగనన   చేపట్టాలనీ, తెలంగాణ రాష్ట్రంలో చేసిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలనే ప్రధాన డిమాండ్ తో మార్చ్ (ఈనెల) 23న బీసీల ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద మహదర్నా చేపట్ట నున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు 

  నేడు హైదరాబాద్ లోని హోటల్ అబినంద్ గ్రాండ్ లో బిసి జేఎసి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ అద్యక్షుతన 20 బిసి సంఘాలు,30 బిసి కుల సంఘాల అతి ముఖ్యమైన సమావేశం జరిగింది,ఈ సందర్భంగా బిసిల చలో ఢిల్లీ మహాదర్నా కార్యక్రమం సంభందించిన వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు, అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు

     కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగనను చేపట్టాలని బీసీలు ఉద్యమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఏప్రిల్ 30,2025న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో జాతీ జన గణనలో సమగ్ర కులగన చేపడతామని ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు 

    కేంద్ర ప్రభుత్వం తాము ప్రకటించినట్లు గానే వచ్చే నెల ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తంగా జాతీ జనగణన  చేపడుతుందని, అందులో భాగంగానే మొదటి దపాలో కుటుంబాల సంఖ్య ను లెక్క బెడుతుందని, అందుకు కెంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, గెజిట్ ద్వారా ఇందులో 

33 ప్రశ్నలను రూపొందించన్నారు ఇందులో ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఎన్ని అడిగిన కేంద్ర ప్రభుత్వం బీసీ కుటుంబాల సంఖ్యను విస్మరించడం చాలా బాధాకరమన్నారు.ఇండ్ల లెక్కింపులో కూడా బీసీ ఇండ్లను లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు 

    అలాగే బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టంనీ కేంద్ర ప్రభుత్వానికి పంపించి సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇంతవరకు బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదించలేదన్నారు, తక్షణమే ఈ బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు 

   ఇంటింటి లెక్కింపులో బీసీ కుటుంబాల లెక్కింపు, బీసీ రిజర్వేషన్ల పెంపు పై జరుగుతున్న ఈ భారీ మహధర్నాకు ఆఖిలపక్ష పార్టీల నేతలు అహ్హనించామ న్నరు, ఈ దర్నా కు దేశంలోని 29 రాష్ట్రాల నుండి బీసీలంతా పెద్ద ఎత్తున కదిలి వచ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు ఇచ్చారు

    బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్హక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్ సంఘానీ మల్లేశ్వర్, బిసి డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోల జనార్దన్, సంచార జాతుల సంఘం అధ్యక్షులు కాటేపల్లి వీరస్వామి, బిసి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్సహనుమాన్లు, బిసి జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్, కన్వీనర్లు నందగోపాల్, ఉదయ్ నేత, శివమ్మ, గూడూరు భాస్కర్ మేరు, వాణీ, వేణు, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, వల్ల బోసు నరసింహ చారి, అనంతోసు బ్రహ్మచారి,తదితరులు పాల్గొన్నారు

📎 Similar News

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

"అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్"గౌరీ జాతీయులకు ప్రకటన ఆహ్వానం🙏

"అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్"గౌరీ జాతీయులకు ప్రకటన ఆహ్వానం🙏ఈ ట్రస్ట్" కేంద్ర కమిటీ "ఎన్నికలు 08 మార్చి 2026 ఆదివారం ఉదయం 10 గంటలనుండి, డోర్ నెంబర్ 57-1-43,గోకుల్నగర్, కంచరపాలెం, విశాఖపట్నం - 530008,పై ట్రస్ట్ హెడ్ ఆఫీస్లో ఎన్నికలు జరుగును.కేంద్ర కమిటీ అనగా, ప్రపంచ వ్యాప్తంగా వున్న గవర జ......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......