"అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్"గౌరీ జాతీయులకు ప్రకటన ఆహ్వానం🙏
"అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్"గౌరీ జాతీయులకు ప్రకటన ఆహ్వానం🙏
ఈ ట్రస్ట్" కేంద్ర కమిటీ "ఎన్నికలు 08 మార్చి 2026 ఆదివారం ఉదయం 10 గంటలనుండి, డోర్ నెంబర్ 57-1-43,గోకుల్నగర్, కంచరపాలెం, విశాఖపట్నం - 530008,పై ట్రస్ట్ హెడ్ ఆఫీస్లో ఎన్నికలు జరుగును.కేంద్ర కమిటీ అనగా, ప్రపంచ వ్యాప్తంగా వున్న గవర జాతీయులు ఈ ఎన్నికలలో పాల్గొనవచ్చును. జిల్లాకు ఒక్కరికి మాత్రమే ఈ కమిటీలో చేర్చుకోవటం జరుగుతుంది. ఈ కమిటీ లో చేరదలిచినవారు ఒక్కరూపాయి కూడా చాందా గాని, నెలసరి, ఇయర్స్ సభ్యుత్వం కూడా కట్టనవసరం లేదు. అలాగని మనం నేటివరకు ఏ ఒక్కరిని ఒక్కరూపాయి చందా కూడా అడగలేదు. ఇట్టిపై అడగము కూడా. ఈ ట్రస్ట్ పేరుతో ఎవ్వరైనా చందాలు వసూలు చేస్తే, చట్ట రీత్యా వారిపై చర్యలు తీసుకుంటాము. కానీ ట్రస్ట్ లో పదవులు పొందినవారు ఎక్కడకు వచ్చినా వారిఖర్చులు వారుమాత్రమే భరించవలెను. పదవులు పొందిన వారు, వారి పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జెరాక్స్ మాత్రము ఇవ్వాలి. జిల్లా కమిటీ ఎన్నికలు, ఏప్రిల్ 08,2026 ఆదివారం ఉదయం పై ఆఫీస్ లోజరుగును. ఇది గవర జాతీయులు వున్న ప్రతి జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు ఆరోజు చేయుట జరుగుతుంది. ఇందు పదవులు పొందిన వారు కూడా, ఒక పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జెరాక్స్ తప్పని సరిగా ఇవ్వాలి. పై ట్రస్ట్ ఆశయాలు మరొక్క సారి తెలియ జేస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా వున్న గవరజాతీయులంతా ఒక్కతాటిపై నిలపాలని, మన గవర జాతీయులకు ప్రభుత్వ రికార్డ్ ప్రకారం "BC -D"ఉన్నందున, మనజాతి బావితరాల పిల్లలకు అన్యాయం జరుగుతుందని,"BC - A"మార్పించమని, మరియు ప్రపంచ వ్యాప్తంగా గవరజాతీయులంతా "BC - A"లోనే వుండాలనేదే మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం. మరియు కులగనసర్వే నిర్వహించమని,ఈ ఆశయాలతోనే పై ట్రస్ట్ 3 ఇయర్స్ క్రితం ప్రారంభం ఐనది. గవర జాతీయలంతా వున్న అన్ని రాష్టాలకు, జిల్లా లకు, గ్రామాలకు వెళ్లి పెద్దలను, సంఘ ప్రతినిధులను కలిసి తేది 17-07-2023 న అనకాపల్లి లో సమావేశం & పిక్ నిక్ ఏర్పాటు చేసాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గౌరీ సంఘాలు ఏర్పడి, సమావేశాలు, పిక్ నిక్ లు జరుపుతూ, వారి వారి గ్రామాలలో గౌరీ జాతీయులను సేవలనదిస్తున్నారు. ఇంకా కొంత మార్పు రావలసిన వుంది. తదుపరి, BC - D" గ్రూప్ నుండి "BC - A"గ్రూప్ కి మార్పించమని, అధికార ప్రతిపక్షం నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, అన్ని జిల్లా కలక్టర్స్ లకు, మనకుల నాయకులకు మెమోరాండాలు పై ట్రస్ట్ నుండి ఇవ్వటం జరిగింది.వీటిపై ఢిల్లీ లో BJP మంత్రులను కలసి వారికీ మెమోరాండాలు ఇచ్చి ఒకరోజు దీక్సలు చేయటం జరిగింది. అందుకుగాను పురందరేశ్వరి గారి సహకారంతో, మోడి గారు, కులగన సర్వే నిర్వహిస్తామని అధికారికంగా ప్రకటించిన, మన ప్రభుత్వం వారు నేటికీ నిర్వహించడంజరుగలేదు. కులగన సర్వే & BC - D నుండి A కి మార్పు కోసం మన జాతి నాయకులకు మేము మేమోరాండాలు ఇచ్చినా ఒక్కరూ మనజాతీయులకోసం అసెంబ్లీ లో చర్చకు తీకుకూరాలేదు. అందుకోసం, మన జాతి అభిమానులు సహకరిస్తే,"గవర నాడు"పేరుతో మహా ఉద్యమం చేయటం, మన జాతీయులు సహకరించకుంటే కోర్ట్ కి వెళ్లాలని నిర్ణయించాం. ఇలాంటి తరుణం లో వీరవాసరం నుండి భీమవరం వరకు వున్న మన గవర జాతీయులంతా,"గవరనాడు ఉద్యమం "చేద్దాం. గవర జాతీయులంటే ప్రపంచానికి తెలియ జేద్దాం అని,అందుకు మా రైతులమంతా, బియ్యం, ఉప్పు, పప్పు, వసూలు చేసుకొని, ఎంతమంది వచ్చినా వంటలు కూడా మేం చేసి అందరికి సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అందుకు వారందరికీ మాట్రస్ట్ తరపున ధన్యవాదములు.తేది 12-07-2026 న "గవర కుల అఖిల పక్స సమావేశం"అనకాపల్లి లో నిర్వహించి, అందు, మన గవర జాతీయుల అన్ని పార్టీ నాయకులను, మన కేంద్ర, జిల్లాల కమిటీ వారు, అన్ని గౌరీ సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, దానిప్రకారం ముందుకు వెళ్ళటానికి, ఈ లోగా "గవరజాతి - చరిత్ర - దశ - దిశ "పేరుతో 501పేజీలు, 50,001బుక్స్ "సావినీర్ ప్రింట్ "చేసి, ప్రపంచ వ్యాప్తంగా వున్న అన్ని గౌరీ సంఘాలకు, పెద్దలకు అందేలా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు గవర జాతీయులంతా ఆశీర్వదిస్తారని ఆర్ధిస్తున్నాము. మరొకవిషయం. మన గవర జాతీయులు, మన పై ట్రస్ట్ పనిమీద గాని, ఏ ఇతర పని మీద వచ్చినా పై మన ట్రస్ట్ అడ్రస్ నందు ఉండటానికి, భోజనాలు ఏర్పాట్లు చేసాం. పై ఊరివారు, పై రాష్ట్రం వారు ముందుగా మాకు ఫోన్ చేసి, మాసేవలు పొందవచ్చు. అంతా ఫ్రీ. గమనించగలరు.
మీ,
ఆడారి ఉమా శంకరరావు
(ఫౌండర్ & చైర్మన్)
అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య.
సెల్ : 83284 17559
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......