;

గవర జాతీయ యువతికి వివాహ సహాయం – అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య కీలక నిర్ణయం

news

గవర జాతీయ యువతికి వివాహ సహాయం – అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య కీలక నిర్ణయం

అన్నవరం / ప్రకాశం జిల్లా:

గవర జాతీయులకు చెందిన పేద కుటుంబానికి చెందిన ర్. భావానీ అనే యువతికి వివాహం చేయడానికి అంతర్జాతీయ గౌరీ సేన ఐఖ్య సమాఖ్య ట్రస్ట్ ముందుకొచ్చింది. సుమారు 40 సంవత్సరాలు వయస్సు గల భావానీకి ఇప్పటివరకు వివాహం జరగకపోవడానికి పేదరికమే ప్రధాన కారణమని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

ఈ మేరకు ట్రస్ట్ ప్రకటన విడుదల చేయగానే, గవర జాతీయులకు చెందిన అనేక మంది పురుషులు—భార్య మృతి చెందినవారు, పిల్లలు ఉన్నవారు—తమ ఫోటోలు, వ్యక్తిగత వివరాలతో ట్రస్ట్ ఫౌండర్‌ను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్ ఫౌండర్ ఆడారి ఉమా శంకరరావు స్వయంగా పలువురి ఇళ్లకు వెళ్లి వారి పూర్తి వివరాలను పరిశీలించినట్లు తెలిపారు.

అయితే, గతంలో వివాహం కాని యువతిని కేవలం పేదరికం కారణంగా ద్వితీయ భార్యగా ఇవ్వడం అన్యాయమని భావించి, అటువంటి ప్రతిపాదనలను ట్రస్ట్ తిరస్కరించినట్లు ఆయన స్పష్టం చేశారు. వివాహం జరిగి పిల్లలు లేని లేదా విడాకులు పొందిన మహిళలతోనే అటువంటి పురుషులకు వివాహాలు జరగడం సముచితమని ట్రస్ట్ నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఉమా శంకరరావు మాట్లాడుతూ,

“మేము మ్యారేజ్ బ్యూరో కాదు. గవర జాతీయుల సంక్షేమం, సమాజంలో న్యాయం, గౌరవం నిలబెట్టడమే మా లక్ష్యం”

అని పేర్కొన్నారు.

ఇక ర్. భావానీ విషయానికొస్తే, ఆమె వయస్సుకు తగిన, ఇప్పటివరకు వివాహం కాని వ్యక్తిని ఇప్పటికే ఎంపిక చేసినట్లు తెలిపారు. వరుడు తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి అంగీకారం తెలిపారని, మార్చి నెలాఖరులో అన్నవరం లో ఈ వివాహాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

సమాజంలో పేదరికం కారణంగా పెళ్లి కాకుండా మిగిలిపోయే మహిళలకు ఇది ఆదర్శప్రాయమైన నిర్ణయంగా పలువురు గవర జాతీయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......