బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న నేతకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ – బీసీ సమాజంలో ఆగ్రహం
బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్న నేతకు టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ – బీసీ సమాజంలో ఆగ్రహం
మాధవరెడ్డి చేరికపై 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 5 (ప్రత్యేక ప్రతినిధి):
బీసీ సమాజం సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకున్న నేతకు టికెట్ కేటాయించడంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసిన వ్యక్తిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
నేడు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ నేతలతో కలిసి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆపై చట్టంగా మార్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలుకు జీవో నెంబర్ 9 జారీ చేసిందన్నారు. ఈ జీవోతో సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాల్లో బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం దక్కుతుందని రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమాజం సంబరాలు చేసుకుందని తెలిపారు.
కోర్టుల ద్వారా బీసీ రిజర్వేషన్లకు అడ్డంకులు
అయితే, రెడ్డి జాగృతి నాయకుడు బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలును నిలిపివేయడంతో పాటు జీవోను రద్దు చేయించారని జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
60 శాతం జనాభా కలిగిన బీసీల హక్కులను కాలరాసిన ఈ చర్యకు వెనుక ఎవరు ఉన్నారో తేలాలన్న డిమాండ్‌తో బీసీ సమాజం రాష్ట్రవ్యాప్తంగా రోడ్లెక్కిందని, చివరకు రాష్ట్ర బంద్ నిర్వహించి ఉద్యమాన్ని ఉధృతం చేసిందని గుర్తు చేశారు.
మాధవరెడ్డికి టికెట్ – అనుమానాలకు తావు
ఇలాంటి పరిస్థితుల్లో, బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డ మాధవరెడ్డిని మేడ్చల్ నియోజకవర్గం, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ 10వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి టీఆర్ఎస్ పార్టీ బీ–ఫారం ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
ఈ చేరిక వెనుక పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆదేశాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాధవరెడ్డికి టికెట్ ఇచ్చిన ఆధారాలను మీడియాకు చూపించారు.
బీసీలకు వ్యతిరేక సందేశం
ఇన్నాళ్లు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ, బీసీ ద్రోహిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా బీసీలకు తాము వ్యతిరేకమేనని బహిరంగంగా ప్రకటించినట్లయిందని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఒకవైపు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలుపుతూ, మరోవైపు కోర్టుల్లో బీసీలకు వ్యతిరేకంగా కేసులు వేయించిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
48 గంటల గడువు
మాధవరెడ్డి చేరిక, టికెట్ కేటాయింపుపై పార్టీ అగ్రనేతలు 48 గంటల్లోగా స్పష్టమైన వివరణ ఇవ్వాలని, ఒకవేళ వారికి తెలియకుండా పార్టీలో చేర్చారంటే మాధవరెడ్డిని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే, బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న కుట్రలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉందని బీసీ సమాజం భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీసీ నేతలకు హెచ్చరిక
టీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నేతలు ఇప్పటికైనా మేల్కొని, బీసీ వ్యతిరేక శక్తులను పార్టీకి దూరంగా పెట్టేందుకు కేసీఆర్, కేటీఆర్‌లపై ఒత్తిడి తీసుకురావాలని, లేకపోతే వారు కూడా మాధవరెడ్డికి మద్దతిచ్చిన వారిగానే బీసీ సమాజం పరిగణిస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
మాధవరెడ్డి చేరిక, టికెట్ కేటాయింపుపై 48 గంటల్లోగా స్పందన రాకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని, ఆ తర్వాత కూడా పార్టీ దిగిరాకపోతే తెలంగాణ అంతటా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి బీసీల ద్రోహుల జాబితాను ప్రజల ముందుకు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బొంద పెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని హెచ్చరిస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, కో–చైర్మన్ దిటి మల్లయ్య, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మని మంజరి సాగర్, రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, యువజన సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......