;

బిసి చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న చలో! తిరుపతి!!

news

ఫిబ్రవరి 12న తిరుపతిలో రాయలసీమ బిసి చైతన్య మహాసభ

సమగ్ర కులగణన, 52% బిసి రిజర్వేషన్ల సాధనే లక్ష్యం : బిసి చైతన్య వేదిక

తిరుపతి, (వార్త):
బిసి కులాలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా బిసి చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి ఇందిరా (మున్సిపల్) మైదానంలో రాయలసీమ బిసి చైతన్య మహాసభను ఘనంగా నిర్వహించనున్నట్లు వేదిక నాయకులు తెలిపారు.

ఈ మహాసభలో సమగ్ర కులగణన పూర్తైన అనంతరం జనాభా ప్రాతిపదికన బిసి కులాలకు స్థానిక సంస్థలలో 52 శాతం రిజర్వేషన్లు కల్పించి, A–B–C–D వర్గీకరణతో ఎన్నికలు నిర్వహించాలి అన్న డిమాండ్‌ను ప్రధానంగా వినిపించనున్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా, దేశ జనాభాలో సుమారు 60 శాతం ఉన్న బిసి కులాలు ఇప్పటికీ ఆర్థికంగా, సామాజికంగా, విద్యా–రాజకీయ రంగాల్లో తీవ్రంగా వెనుకబడి ఉన్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే బిసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టసభల్లో ప్రాతినిధ్యం ఇవ్వడంలో పాలకులు దగా చేస్తున్నారని విమర్శించారు.

జనాభా ప్రాతిపదికన పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో సీట్ల కేటాయింపులు జరగనంత వరకు బిసీలకు న్యాయం జరగదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా పార్లమెంట్లు, అసెంబ్లీలు, జడ్పిటిసీలు, గ్రామ పంచాయితీల్లో అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతుండగా, 90 శాతం మంది ప్రజలు ఓటర్లుగా మాత్రమే మిగిలిపోతున్న పరిస్థితి నెలకొందని తెలిపారు.

బి.పి. మండల్ ఉద్యమం ద్వారా ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో బిసి కులాలు రాజ్యాధికారం సాధించుకున్నాయని గుర్తు చేస్తూ, అదే స్ఫూర్తితో దక్షిణ భారతదేశంలోనూ బిసీలు సంఘటిత ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
హక్కులు అడిగితే రావు… పోరాడితే వస్తాయి” అన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మహాసభ ద్వారా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించడంతో పాటు బిసి స్వతంత్ర్య ఉద్యమానికి నాంది పలకనున్నట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టి, బిసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారి జనాభా మేరకు వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు గళం విప్పాలని కోరారు.

ప్రధాన డిమాండ్లు:

మహాసభకు నాయకత్వం వహిస్తున్నవారు:

వీరవల్లి శ్రీనివాస్ – జాతీయ అధ్యక్షులు
📞 9291579865

అన్నం వెంకటేశ్వరరావు – రాష్ట్ర అధ్యక్షులు
📞 9346614366

శ్రీమతి వై. లక్ష్మీశైలజా గౌడ్ – జాతీయ మహిళా అధ్యక్షురాలు
📞 6281910633

శ్రీమతి మల్లేశ్వరి యాదవ్ – రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
📞 9396920642

టి.వి. రమణయ్య – జాతీయ ప్రధాన కార్యదర్శి
పి.వి. రమణయ్య – రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
మునిశేఖర్ యాదవ్ – జాతీయ యూత్ అధ్యక్షులు
దుర్గంపాటి పద్మజ – రాష్ట్ర కార్య నిర్వాహక మహిళా అధ్యక్షురాలు
నందవరపు శ్రీనివాస్ – రాష్ట్ర కార్యదర్శి
సిహెచ్. సురేష్ – జాతీయ యూత్ ప్రధాన కార్యదర్శి

నిర్వహణ కమిటీ:

వంకా రమణయ్య యాదవ్ – చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త
📞 6300720306

కన్వీనర్లు:

నియోజకవర్గ / జిల్లా నాయకులు:

మదన్ మోహన్ (తిరుపతి), అన్యం ఈశ్వర్ గౌడ్ (చంద్రగిరి), గంజి రవి (వెంకటగిరి), బాబూరావు గౌడ్ (గూడూరు), బాలకృష్ణ (శ్రీకాళహస్తి), ప్రతాప్ (సత్యవేడు), మెల్లకంటి వీరాస్వామి యాదవ్ (సూళ్లూరుపేట), చంద్రశేఖర్ గౌడ్ (తిరుపతి జిల్లా యూత్), లేపాకుల నాగరత్నం (చిత్తూరు జిల్లా మహిళా), ముని రాజమ్మ (తిరుపతి జిల్లా మహిళా), ఇంటి వెంకట సుబ్బయ్య (నంద్యాల), సీతా రాఘవల నాయుడు (చిత్తూరు), వెనిగారం వెంకటేశ్వర్లు ఆచారి (ఉమ్మడి కడప), మారిశెట్టి సూరిబాబు (రాష్ట్ర యువజన), జమ్ముల భార్గవరామ్ (రాష్ట్ర విద్యార్థి విభాగం), రెడ్డిచర్ల ప్రసాద్ (నంద్యాల జిల్లా) తదితరులు పాల్గొననున్నారు.

ఈ మహాసభను విజయవంతం చేసి బిసి హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని బిసి చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......