వడ్డెరలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి జాతియ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్
వడ్డెరలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి
హైదరాబాద్, జనవరి 11 (ఆంధ్రప్రభ):
వడ్డెర కులానికి రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ డీసీసీ చైర్మన్, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పిట్ట శ్రీధర్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వడ్డెర కులం నుంచి కేవలం ఒక్కరే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం డీసీసీ కార్యాలయంలో వడ్డెర కుల సంఘాల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిట్ట శ్రీధర్ మాట్లాడుతూ వడ్డెర కులం జనాభాలో అధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా తీవ్ర నిర్లక్ష్యం ఎదుర్కొంటోందన్నారు. శాసనసభ, శాసనమండలి, స్థానిక సంస్థల్లో వడ్డెరలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో వడ్డెర కులానికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు కేటాయించాలని కోరారు.
ఈ సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,
“వడ్డెరలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వర్గం. అయినప్పటికీ రాజకీయంగా వారికి న్యాయం జరగడం లేదు. బీసీల ఐక్యతతోనే హక్కులు సాధించుకోవాలి. వడ్డెరలకు తగిన రాజకీయ వాటా దక్కే వరకు బీసీ జేఏసీ తరఫున పోరాటం కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు.
అదేవిధంగా వడ్డెర బంధు పథకం ప్రవేశపెట్టి వడ్డెరలను ఆర్థికంగా ఆదుకోవాలని, మైనింగ్ క్వారీలు, కాంట్రాక్టుల్లో వడ్డెరలకు 20 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు, మహిళా ప్రతినిధులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......