;

బీ.సీ. ఐక్య వేదిక ఆధ్వర్యంలో గెలిచిన బీసీ సర్పంచులకు సన్మానం – గ్రామస్థాయిలో నూతన కమిటీల ఏర్పాటు జరిగింది

news

బీ.సీ. ఐక్య వేదిక ఆధ్వర్యంలో గెలిచిన బీసీ సర్పంచులకు సన్మానం – గ్రామస్థాయిలో నూతన కమిటీల ఏర్పాటు జరిగింది

శేరిలింగంపల్లి, జనవరి 07:
బీ.సీ. ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన బీసీ సర్పంచులకు సన్మానం చేయడంతో పాటు గ్రామస్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసే కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆర్కే మారుతి ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా కోటగిరి, మారుతి తదితర ప్రాంతాల్లో పర్యటించి గెలిచిన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే ప్రజాప్రతినిధులుగా బీసీ సర్పంచులు నిలవాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

సర్పంచిగా గెలిచిన జమ్గ బి, దత్తు రెడ్డిలను ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానం చేయగా, చాప్టా బి శివాజీ రావు (బీసీ సర్పంచ్), ఘణాపూర్ కృష్ణ ముదిరాజ్ (బీసీ సర్పంచ్) తదితరులను కూడా ఘనంగా గౌరవించారు. కంగిటీ గ్రామంలో కృష్ణ ముదిరాజ్, తుకారాం, రాములు, శ్రీనివాస్, నాందేవ్, గోపాల్ సమన్వయంతో గ్రామ కమిటీల ఏర్పాటు జరిగింది. అలాగే సంగోజిపేట్, జంగి, గాంధీనగర్, రాసోల్ తదితర గ్రామాల్లో స్థానికంగా కమిటీలను ఏర్పాటు చేశారు.

సంగారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షులుగా పల్లపు నర్సింలు వడ్డే రాజు, యువజన విభాగం అధ్యక్షులుగా సతీష్ కుమార్ చారి, కార్యదర్శిగా శ్రవణ్ కుమార్ చారి నియామకాలు జరిగాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలైన రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ తదితర జిల్లాల్లో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జ్‌లకు సూచించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు ముందే రాష్ట్రవ్యాప్తంగా బీ.సీ. ఐక్య వేదిక కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని, ఇందుకు అన్ని జిల్లాల కన్వీనర్లు సమన్వయంతో పనిచేయాలని బేరి రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సైట్రరీ సిరిపురం హరికృష్ణ చారి, గోపీనగర్ యాదవ్ సంఘం అధ్యక్షులు సిరిపురం రాధాకృష్ణ చారి, ఆర్సిపురం యాదవ్ సంఘం అధ్యక్షులు రాగం రమేష్ యాదవ్, పి. గణేష్ యాదవ్, శేరిలింగంపల్లి బీసీ సంఘం కన్వీనర్ కొత్త మనోజ్ ముదిరాజ్‌తో పాటు బీసీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......