;

బీసీలకు 52% రిజర్వేషన్, రక్షణ చట్టం అమలు చేయాలి: వీరవల్లి శ్రీనివాస్

news

బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రెస్‌మీట్

బీసీలకు 52% రిజర్వేషన్, రక్షణ చట్టం అమలు చేయాలి: వీరవల్లి శ్రీనివాస్

తిరుపతి మహానగరం ప్రెస్‌క్లబ్‌లో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ చైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వంక రమణయ్య యాదవ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ—ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా సమగ్ర కుల గణన నిర్వహించి, ప్రతి కులం జనాభా వివరాలను ప్రకటించిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే, రాష్ట్రంలో బీసీలపై ఆధిపత్య కులాల దాడులు, హత్యాకాండలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఆ హామీని విస్మరించడంతో బీసీ చైతన్య వేదిక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టిందన్నారు. దీర్ఘకాల పోరాట ఫలితంగానే ఇటీవల ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదా బిల్లును ప్రకటించిందని, ఇది బీసీ చైతన్య వేదిక విజయమని పేర్కొంటూ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో తిరుపతి మహానగరంలో బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ బీసీ సదస్సు బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఈ సందర్భంగా గతంలో బీసీ చైతన్య వేదిక సమావేశాన్ని విజయవంతం చేసిన జిల్లా అధ్యక్షులు వంక రమణయ్య యాదవ్‌ను అభినందిస్తూ, ఆయనను బీసీ చైతన్య వేదిక రాయలసీమ జిల్లాల సమన్వయకర్తగా నియమించారు.

అలాగే,

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా బీసీ చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వంగ అరుణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో బీసీ చైతన్య వేదిక తిరుపతి జిల్లా గౌరవ అధ్యక్షులు సుట్టి రవిశర్మ, చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఈశ్వర్ గౌడ్, తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు మదన్ మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు పంట్రగం వెంకటేశ్, కేవీ పురం మండల అధ్యక్షులు పరంధమం, బోడయ్య తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......