;

విధుల్లో ఉన్న సీఐపై దుర్భాషలు – మైసూరా రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి : బీసీ, యాదవ సంఘాలు

news

విధుల్లో ఉన్న సీఐపై దుర్భాషలు – మైసూరా రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి : బీసీ, యాదవ సంఘాలు

అనంతపురం | 03-01-2026

అనంతపురం జడ్పీ కార్యాలయంలో 03-01-2026న జరిగిన సర్వసభ్య సమావేశంలో విధులు నిర్వహిస్తున్న 2 టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ పై ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అనుచరుడు మైసూరా రెడ్డి దుర్భాషలాడిన ఘటన తీవ్రంగా ఖండనీయమని బీసీ, యాదవ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

ఈ ఘటనకు నిరసనగా కదిరి ఆర్ అండ్ బి బంగ్లాలో బీసీ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి చింత నాగరాజు పిలుపుమేరకు కదిరి డివిజన్ యాదవ సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రోటోకాల్ ప్రకారం విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారిపై అనుచితంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

సీఐ శ్రీకాంత్ యాదవ్‌పై జరిగిన దుర్భాషలు, విధులకు ఆటంకం కలిగించిన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, మైసూరా రెడ్డిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన సీఐకి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. లేనిపక్షంలో ఈ అంశాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ దృష్టికి, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ ప్రెస్ మీట్‌లో బీసీ ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి చింత నాగరాజు, కదిరి డివిజన్ యాదవ సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీరామ్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు యాదవ్, నాయకులు సుధాకర్ యాదవ్, రామచంద్ర యాదవ్, కటారి రెడ్డి యాదవ్, రామ్మోహన్ యాదవ్, లక్ష్మీపతి యాదవ్, నరేంద్ర యాదవ్, శ్యాంప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......