గుంటూరులో సావిత్రిబాయి ఫూలే జయంతి
గుంటూరులో సావిత్రిబాయి ఫూలే జయంతి
విద్యార్థులకు పండ్ల పంపిణీ చేసిన ఓబీసీ సంఘ నేతలు
గుంటూరు జిల్లాలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా విద్యకు పునాది వేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ గారు మాట్లాడుతూ, సమాజంలో విద్యే నిజమైన మార్పుకు మార్గమని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి సావిత్రిబాయి ఫూలే చూపిన దారి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందుకే పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు శ్రీ రాజపుత్ర సత్యం సింగ్ గారు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్, రాష్ట్ర బీసీ నాయకులు శ్రీ జి.కె. శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో పోషణా అవగాహన పెంపొందించడంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ దాసరి జాన్ బాబు,
కుమ్మరి, శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ పారేళ్ళ బసవేశ్వర రావు,
భట్రాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కృష్ణంరాజు,
ఓబీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కొనిదే గోపీకృష్ణ,
ఓబీసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి తులసి,
శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ కుందుర్తి,
పాఠశాల నిర్వహాకులు శ్రీ పూర్ణ చంద్ర రావు గారు
తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సావిత్రిబాయి ఫూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా విద్య, ఆరోగ్యం, సామాజిక సమానత్వంపై ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
📎 Similar News
జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా
*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి* ఏ......
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం
బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......