;

బెస్త కార్పొరేషన్‌కు తక్షణమే నిధులు మంజూరు చేయాలి

news

బెస్త కార్పొరేషన్‌కు తక్షణమే నిధులు మంజూరు చేయాలి

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మకు అఖిల భారత బెస్త మహాసభ విన్నపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు పూర్తయిన నేపథ్యంలో, రాష్ట్రంలోని బెస్తలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి అఖిల భారత బెస్త మహాసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా సోమవారం నాడు అఖిల భారత బెస్త మహాసభ రాష్ట్ర అధ్యక్షులు పి.జి. వెంకటేష్ గారు, రాష్ట్రంలోని బెస్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు సబితమ్మ గారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వెంకటేష్ గారు మాట్లాడుతూ—
రాష్ట్రంలో 18 లక్షలకు పైగా జనాభా కలిగిన బెస్త సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నదని, అందుకే బెస్త కార్పొరేషన్‌కు కనీసం రూ.5,000 కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య కుల కార్పొరేషన్‌ల మాదిరిగా బెస్త కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసి, బెస్త యువతకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు.

అలాగే ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతనే బెస్తలకు కూడా కల్పించి, చదువుకున్న ప్రతి బెస్త యువకుడిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

విదేశాల్లో చదవాలనుకునే బెస్త విద్యార్థుల కోసం విదేశీ విద్యా పథకం ప్రారంభించి, వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

బెస్త కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లతో పాటు అన్ని బెస్త కుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలని సూచించారు.
ఇతర ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వారి కార్పొరేషన్‌ల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నీ బెస్త కార్పొరేషన్ ద్వారా కూడా అందించాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, బెస్తలకు ఇప్పటివరకు కేవలం చైర్మన్, డైరెక్టర్ పదవులకే పరిమితం చేసి, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు, అలాగే త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ (గవర్నర్ కోటా) వంటి రాజకీయ అవకాశాలు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కూటమి ప్రభుత్వం బెస్తలకు న్యాయం చేయాలని కోరారు.

దీనికి స్పందించిన మంత్రి సబితమ్మ గారు, త్వరలో ఆదరణ–3 పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
అయితే ఆదరణ పథకం అమలుపై సంతోషం వ్యక్తం చేసిన వెంకటేష్ గారు, బెస్తలను కేవలం కులవృత్తులకే పరిమితం చేయకుండా, అగ్రకుల కార్పొరేషన్‌లకు అమలవుతున్న అభివృద్ధి పథకాల మాదిరిగానే బెస్త కార్పొరేషన్‌కు తగిన నిధులు మంజూరు చేసి సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలి అని మరోసారి స్పష్టం చేశారు.

📎 Similar News

జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా

*జాతి జనగణలో బీసీ కుల గణన చేపట్టాలనీ ఈనెల 23న ఢిల్లీలో బిసిల మహదర్నా* *ఎస్సీ ఎస్టీ కుటుంబాల వలే, బిసి కుటుంబాల ను కూడా లెక్కించాలే**బిసీ కుల గణన జరిగి,బిసీ రిజర్వేషన్లు  పెంచే వరకు డిల్లి పై పోరాటం ఆగదు**బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి*     ఏ......

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు

ఎమ్మెల్యేలు, ఎంపీలు బానిసలుగా మారారు: మేడా శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలురాజకీయ వ్యవస్థపై రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “నేటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులుగా క......

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతం

బీసీల సమైక్య నిరసన – బీసీ రాజ్యధికారానికి తొలి సంకేతంప్రత్యేక ప్రతినిధిరాష్ట్ర రాజధానిలో నేడు బీసీల సమైక్య నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. వివిధ బీసీ సంఘాల పిలుపుతో భారీగా కూడిన ఆందోళనకారులు ఆకస్మికంగా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి దిగడంతో నగరంలో ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతింది.నిరసన నేపథ్యంలో మాట్ల......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......