రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన తాజా వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తేదీ: 15/16-02-2026
స్థలం: రాజమండ్రి
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన తాజా వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రాజమండ్రిలో ఆర్‌పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో మాట్లాడుతూ, “హిందూ అనే పవిత్ర పదాన్ని వక్రీకరించే విధంగా వ్యాఖ్యలు చేయడం సమాజంలో అపార్థాలు, ఉద్రిక్తతలకు దారితీయవచ్చు” అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశముందని తెలిపారు.
మోహన్ భగవత్ తన వ్యాఖ్యలను స్పష్టీకరించి, అవసరమైతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. “హిందూ ధర్మం మూలాలు, విలువలు పరస్పర గౌరవం, సహనం, సామరస్యాన్ని ప్రతిబింబిస్తాయి. వాటిని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు” అని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ గత చరిత్ర, కార్యకలాపాలపై కూడా ఆయన విమర్శలు చేశారు. “దేశంలో మత ఘర్షణలు పెరగకుండా అన్ని సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యల వెనుక మత కలహాలను ప్రేరేపించే గూడార్థం ఉందనే అనుమానం వ్యక్తమవుతోందని, సమాజంలో శాంతి, ఐక్యతను కాపాడడం అత్యవసరమని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ఆర్‌పిసి సెక్యులర్స్ విభాగం అధ్యక్షులు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో డి.వి. రమణమూర్తి, సిమ్మా దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాద్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల దుర్గాప్రసాద్, వల్లి శ్రీనివాసరావు, యర్రా బాల మురళీకృష్ణ, బసా సోనియా, మేకల కిరణ్ కళ్యాణ్, చల్లా సాంబశివరావు, మాసా అప్పాయమ్మ, చల్లా వంశీ, ఎస్‌కే బాబీ తదితరులు పాల్గొన్నారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......