;

రాష్ట్రములోని బెస్తలు కూటమి వెంటే: నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన బెస్త మల్లికార్జున

news

మంగళగిరి:

స్థానికంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం బూత్ అబ్జర్వర్ల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ హాజరై, పాల్గొన్న నాయకులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయికి వెళ్లి అక్కడి పరిస్థితులను సమగ్రంగా తెలుసుకోవాలని, కనీసం ప్రతి బూత్‌కు ఒక రోజు సమయం కేటాయించి, బూత్‌లో పార్టీ నిర్మాణం ఎలా బలపడుతుందో చర్చించి నివేదిక ఇవ్వాలని సూచించారు.

అనంతరం నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ బెస్త ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో బెస్తల పాత్ర కీలకమైందని అన్నారు. బెస్త సామాజిక వర్గానికి ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ బెస్త కార్పొరేషన్‌కు చైర్మన్, డైరెక్టర్లను నియమించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ఆఫ్కౌఫ్ (ఫిషరీస్) చైర్మన్‌గా, తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన యువనేత కడప యాటగిరి రాం ప్రసాద్ ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రాం ప్రసాద్ ఎంపికతో రాష్ట్రంలో బెస్తలకు రాజకీయ గుర్తింపు మరింత బలపడిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బెస్త సామాజిక వర్గం తరఫున నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

దీనికి స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపిన జీఓ 217ను రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే మత్స్యకారులకు 50 సంవత్సరాల వయస్సు నుంచే పింఛన్ అందించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలైన ముఖ్య నిర్ణయమని చెప్పారు. మత్స్యకారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ప్రభుత్వానికి మరియు సమాజానికి మధ్య వారధిగా ఉండే నాయకులు బెస్తల విద్య, సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

📎 Similar News

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......