ఫూలే విగ్రహంపై దాడి — మనువాద ఉగ్రవాదులను తక్షణమే అరెస్ట్ చేయాలి
ఫూలే విగ్రహంపై దాడి — మనువాద ఉగ్రవాదులను తక్షణమే అరెస్ట్ చేయాలి
తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలి : ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక డిమాండ్
తెలంగాణ రాష్ట్రం, రామచంద్రపురం మండలం, తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహంపై పట్టపగలు, పోలీసుల సమక్షంలోనే దుండగులు కాళ్లతో తన్ని కూల్చేందుకు ప్రయత్నించడం అత్యంత హేయమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైన చర్యగా ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తోంది.
సామాజిక సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు ఫూలే విగ్రహంపై ఈ విధమైన మూకదాడి చేయడం ద్వారా మనువాద ఉగ్రవాదులు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు.
అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన పోలీసుల సమక్షంలోనే జరగడం. ఇది శాంతిభద్రతల వైఫల్యాన్ని, అలాగే దళిత–బహుజనులపై జరుగుతున్న దాడుల పట్ల నిర్లక్ష్య ధోరణిని స్పష్టంగా చూపిస్తోంది.
ఈ సంఘటనపై
-
దాడికి పాల్పడ్డ మనువాద ఉగ్రవాదులను తక్షణమే అరెస్ట్ చేయాలి,
-
వారి పై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి,
-
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విగ్రహాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి,
-
ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి
అని ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక గట్టిగా డిమాండ్ చేస్తోంది.
ఫూలే ఆశయాలపై దాడి అంటే అది సమాజ సమానత్వంపై దాడి చేసినట్లే. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్య శక్తులు ఏనాడూ సహించవు. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ వేదిక స్పష్టం చేస్తోంది.
— ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనార్టీ మహిళా ఐక్యవేదిక
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......