;

ఫోరం ఫర్ ఆర్ టి ఐ నేతలు, తిరుపతి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ,జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారితో సమావేశం

news

ఫోరం ఫర్ ఆర్ టి ఐ  నేతలు, తిరుపతి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ,జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారితో సమావేశం

తిరుపతి

ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి.చంద్రమోహన్,జాతీయ అధ్యక్షులు మట్టా.ప్రసాద్ సూచనల మేరకు,జాతీయ సంయుక్త కార్యదర్శి కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్  నేతృత్వంలో దేశ ప్రఖ్యాతి గాంచిన తిరుపతిలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ వి. సాయి బాబా గారితో, మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి కె.ఎం. రోస్ మాండ్ 

గారినతో, చట్టాలతో కూడిన ఫోరం ఫర్ ఆర్ టి ఐ నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా కలిసి, వారిని సంబంధిత శాఖల అధికారుల నుంచి సామాన్య ప్రజలకు కూడా కావలసిన సమాచారాన్ని ఆర్ టి ఐ చట్టం నిర్దేశిత గడువు లోపల అందించాలని కోరినప్పుడు,ఆర్ టి ఐ సెక్షన్స్ చట్టం ప్రకారం, నిర్దేశిత కాలంలో,వారి శాఖ నుంచి సమాచారం అడిగిన ప్రజలకు అందేలా చేస్తామని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారు, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ, దేశ ప్రఖ్యాతి గాంచిన వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల,తిరుపతి పరిసర ప్రాంతాల్లో రెడ్ శాండల్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నివారణలో సంబంధిత శాఖ అధికారులను, ప్రత్యేక శ్రద్ధ చూపేవిధంగా వారికి అవగాహన కల్పించి ,మన భారత దేశంలోనే  అధిక సంఖ్యలో భక్తులు దర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం ఐన తిరుమల, తిరుపతి దేవస్థానం పవిత్రతను ఈ దేశంలో ఇంకా ఉన్నత స్థితికి తెచ్చేవిదంగా,ఎక్కడ అవినీతి కి తావు లేకుండా చూడాలని, నిజాయితీ అధికారులను,అవేర్నెస్ సంస్థ లను ప్రోత్సహించాలని ఎఫ్ ఆర్ టి ఐ నేతలు కోరారు.దానికి వారు, రిప్లై నిజాయితీ తో స్వచ్ఛంద సర్వీస్ చేస్తూ,గవర్నమెంట్ అధికారులను సమన్వయం చేసుకుంటూ, సమాజం పట్ల తమ దైన శైలిలో బాధ్యత గా ఉంటున్న, ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్డ్ సంస్థ అన్ని శాఖల నేతలకు, ఆక్టివ్ అవేర్నెస్ సభ్యుల ను అభినందిస్తూ, వారి సహకారం ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్ సంస్థ కు అందిస్తామని తెలిపారు.అలాగే ప్రజలు అందరికీ కూడా పారదర్శకంగా గవర్నమెంట్ నుంచి సర్వీస్ అందిస్తూ,ఎక్కడా అవినీతికి  తావులేకుండా,తమ ఆఫీసుల్లో  సిబ్బంది అందరికీ, దిశానిర్దేశం చేసి పబ్లిక్ కు మంచి సేవలు అందిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జాతీయ కమిటీ నేత కె .అజయ్ ప్రసన్న కుమార్ తో పాటు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కరాటే డి సి ఎస్ రాయల్ , రాష్ట్ర ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఎం.సుధాకర్ యాదవ్,జిల్లా మహిళా ఇంచార్జి అధ్యక్షురాలు వి.జయ లక్ష్మీ, తిరుపతి నగర కమిటీ అధ్యక్షులు జి.వేణు గోపాల్ పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......