ఏప్రిల్ రెండవ వారం లో అనంతపురంలో బహుజన ఐక్య ప్రజా ఫ్రంట్ సమావేశం
ఏప్రిల్ రెండవ వారం లో అనంతపురంలో బహుజన ఐక్య ప్రజా ఫ్రంట్ సమావేశం
2029 అధికార లక్ష్యంగా బహుజన కూటమి సన్నాహాలు: డా. పోతుల నాగరాజు
అనంతపురం:
రాష్ట్రంలో బహుజనుల హక్కులు, అధికారాలు, అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఏకం చేసే దిశగా బహుజన ఐక్య ప్రజా ఫ్రంట్ సమావేశం ఏప్రిల్ రెండవ వారంలో అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు వెల్లడించారు.
ఈ సమావేశం ద్వారా 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బహుజన కూటమి ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో దోపిడి రాజకీయాలకు, పాలక వర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రతి బహుజనుడు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
గత 77 సంవత్సరాలుగా రాష్ట్ర పాలన రెండు కుటుంబాలు, రెండు పార్టీలు, రెండు కులాల ఆధిపత్యంలోనే కొనసాగుతోందని, దీని ప్రభావం వల్ల దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, బలహీన వర్గాలు, పేదలు తీవ్రంగా నష్టపోయారని డా. పోతుల నాగరాజు పేర్కొన్నారు.
రాష్ట్ర జనాభాలో 87 శాతం ఉన్న బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పాలకులు, వారి హక్కులు, అధికారాలు, అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు.
భారత రాజ్యాంగం అందించిన ఫలాలు ఎవరికీ దక్కుతున్నాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బహుజన సోదరులు–సోదరీమణులు, విద్యావంతులు, ఉద్యోగులు, రచయితలు, కళాకారులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, రైతు, కార్మిక, మహిళా సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కాన్షిరాం గారి “మన ఓట్లు మనమే వేసుకొని, మనమే మన రాజ్యాన్ని పరిపాలించుకోవాలి” అనే భావనను ముందుకు తీసుకువెళ్తూ, డా. బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆశయాల సాధన కోసమే ఈ ఐక్యత అవసరమని డా. పోతుల నాగరాజు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో BC, SC, ST, మైనారిటీ కుల సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు, మహిళా ప్రతినిధులు, విద్యార్థి నేతలు పాల్గొననున్నారని తెలిపారు. అలాగే BSP, SP, RJD, DMK, BCY పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వంటి బహుజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీల నేతలతో చర్చించి,
2029 ఎన్నికల్లో అధికారాన్ని బహుజనుల చేతుల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో “బహుజన ఐక్య ప్రజా ఫ్రంట్”గా ముందుకు వెళ్లే కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......