బీసీలు ఎంతమంది ఉన్నారో చెప్పరా?
బీసీలు ఎంతమంది ఉన్నారో చెప్పరా?
BC, JAC ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
జనగామలో బీసీ జేఏసీ ఆత్మీయ అభినందన సభ
హైదరాబాద్, జనవరి 18 (విజయ క్రాంతి):
జనగామ జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ అభినందన సభకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన బీసీ సర్పంచులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
సభలో మాట్లాడుతూ మల్లన్న ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “రాష్ట్రంలో కుక్కలకు, పందులకు లెక్కలు ఉన్నాయి. కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు లేవు. ఎందుకు బీసీల జనాభా గణాంకాలు బయటకు చెప్పడం లేదు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాను కులగణన గణాంకాలు అడిగితే ఎమ్మెల్సీ అయినా సమాధానం ఇవ్వడం లేదని, కారణం ప్రభుత్వం బీసీలది కాదని వ్యాఖ్యానించారు.
“పార్టీల బీఫారాలు మీ దగ్గర ఉండొచ్చు… కానీ ఓట్లు మా బీసీల దగ్గరే ఉన్నాయి. ఇది ఎవ్వరూ మర్చిపోవద్దు” అని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో లక్షల సంఖ్యలో బీసీలు కంట్రోల్ బియ్యం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, దీనికి పాలకులే పూర్తిగా బాధ్యులని మల్లన్న ఆరోపించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర నాయకులు బయటపెట్టే వరకు ప్రజలకు నిజాలు తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలు రాజకీయంగా చైతన్యం అవుతూ పార్టీలు మార్చడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఇటీవల కాలంలో ఒక్క రెడ్డి మంత్రి లేకుండానే ముగ్గురు బీసీ బిడ్డలు మంత్రులయ్యేలా చేయగలిగినది బీసీ చైతన్యమేనని పేర్కొన్నారు. “నేను బ్రతికి ఉన్న చివరి నిమిషం వరకు బీసీల కోసం దమ్ము, ధైర్యంతో పోరాటం చేస్తాను” అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కేవలం 13 లక్షల 20 వేల రెడ్డి జనాభాకు 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 60 శాతం బీసీలకు కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం ఘోర అన్యాయం అని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పేరుతో 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి, వాస్తవంగా కేవలం 2 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండలిలో ప్రశ్నించగా ఎవరూ సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు.
గ్రామస్థాయిలో సర్పంచులకు పూర్తి అధికారాలు ఉన్నాయని, తమ గ్రామాల అభివృద్ధికి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. “బీసీల కోసమే టీఆర్పీ వచ్చింది. మీరు ఏ పార్టీలో ఉన్నా, సమయం వచ్చినప్పుడు కలుద్దాం… నిలుద్దాం… గెలుద్దాం. అప్పటివరకు మీకు ఏ కష్టం వచ్చినా బీసీ జేఏసీ, టీఆర్పీ, తీన్మార్ మల్లన్న ఎల్లప్పుడూ అండగా ఉంటారు” అని హామీ ఇచ్చారు.
ఈ సభ బీసీల్లో రాజకీయ చైతన్యాన్ని మరింత పెంచిందని, రాబోయే రోజుల్లో బీసీ రాజ్యం దిశగా అడుగులు పడతాయని నాయకులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, జనగామ జిల్లా అధ్యక్షురాలు చెరుకూరి మౌనిక యాదవ్, బీసీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......