;

తల్లిదండ్రుల పోరాటానికి మరో విజయం

news

తల్లిదండ్రుల పోరాటానికి మరో విజయం

తరగతుల విభజన వివక్షపై వెనక్కి తగ్గిన మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం

అమరావతి:

మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులపై అమలుచేసిన వివక్షాపూరిత తరగతుల విభజన నిర్ణయానికి తల్లిదండ్రుల పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP) ఆధ్వర్యంలో విద్యార్థి తల్లిదండ్రులు చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో, యూనివర్సిటీ యాజమాన్యం ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

“స్కిల్ డెవలప్‌మెంట్” పేరుతో అదనపు ఫీజు చెల్లించిన విద్యార్థులకు ఒక విధంగా, చెల్లించని విద్యార్థులకు మరో విధంగా తరగతులు విభజించడం ద్వారా యాజమాన్యం తీవ్ర వివక్షకు పాల్పడిందని PAAP ఆరోపించింది. ఈ అంశంపై ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖకు చేసిన ఫిర్యాదులతో అధికారులు స్పందించి యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.

దీంతో యాజమాన్యం ఇకపై అందరు విద్యార్థులను ఒకే తరగతిగా నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రుల ఐక్యతకు లభించిన కీలక విజయంగా PAAP పేర్కొంది.

ఇదే సమయంలో, స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 40,000 చొప్పున అక్రమంగా వసూలు చేసిన అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని PAAP తెలిపింది. ఫీజు చెల్లించని విద్యార్థులను ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుంచి తొలగిస్తామని బెదిరించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

అలాగే, గతంలో ఇదే యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ. 26 కోట్లను తిరిగి చెల్లించాలని, రూ. 15 లక్షల పెనాల్టీ చెల్లించాలని రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని PAAP డిమాండ్ చేసింది.

విద్యను వ్యాపారంగా మార్చి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే యూనివర్సిటీలను సహించేది లేదని PAAP హెచ్చరించింది. అక్రమ ఫీజుల వసూళ్లపై వెంటనే విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరింది. తల్లిదండ్రులంతా ఐక్యంగా ఉంటేనే విద్యా చట్టాల అమలు సాధ్యమవుతుందని, మన పిల్లల భవిష్యత్తు రక్షణ సాధ్యమవుతుందని PAAP పేర్కొంది.

సంప్రదింపు వివరాలు:

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (PAAP)

📞 ఫోన్: +91 63053 13558

📧 ఈమెయిల్: parentsassociationap@gmail.com

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......