;

15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ – రాష్ట్రానికి రూ.1,000 కోట్లు త్వరలో విడుదల!

news

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన రూ.2,500 కోట్ల పెండింగ్ నిధుల్లో ఈ నెలాఖరులోపు కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి సమాచారం అందింది. మిగిలిన మొత్తాన్ని వచ్చే నెలలో విడుదల చేసేందుకు కూడా కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ (పీ.ఆర్ & ఆర్.డి) నిధుల వినియోగంపై కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని జిల్లాలకు మెమో పంపి, నిధుల వినియోగంలో డిజిటల్ విధానం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక బ్యాంకు ఖాతా

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం కోసం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ ఖాతాను పీఎఫ్ఎంఎస్ (Public Financial Management System) పోర్టల్‌లో నమోదు చేసి యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలి. అలాగే ఈ-గ్రామ్స్వరాజ్ పోర్టల్‌లో కూడా బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేయడం తప్పనిసరి.

డిజిటల్ విధానంలో పారదర్శకత కోసం ఉపసర్పంచ్‌ను “మేకర్‌గా”, సర్పంచ్‌ను “చెకర్‌గా” నియమించారు. వీరి డిజిటల్ సంతకాలను ఈ-గ్రామ స్వరాజ్ నమోదు చేసి సంబంధిత ఎంపీడీఓల ద్వారా ఆమోదం పొందాలి. ఇందుకు క్లాస్-3 డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు తప్పనిసరి. సైనింగ్, ఎన్‌క్రిప్షన్ సౌకర్యాలతో పాటు యూఎస్బీ టోకెన్ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

డిజిటల్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నిధుల వినియోగం

ఈ మొత్తం డిజిటల్ ప్రక్రియ పూర్తయిన తరువాతే 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకోవచ్చని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లను జీఈఎం పోర్టల్, ఈ-ప్రోక్యూర్‌మెంట్ లేదా ఇతర టెండర్ విధానాల ద్వారా సేకరించాలని పంచాయతీరాజ్ కమిషనర్ శ్రుతి ఓజా ఆదేశించారు.

నిధుల విడుదలతో గ్రామీణాభివృద్ధి పనులకు ఊతం లభించనుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు కీలకంగా మారనున్నాయి.



📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......