;

పచ్చని కోనసీమను సర్వనాశనం చేస్తున్న కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు : మేడా శ్రీనివాస్

news

పచ్చని కోనసీమను సర్వనాశనం చేస్తున్న కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు : మేడా శ్రీనివాస్

కేజీ బేసిన్ సంపదలో 50% వాటా అమలు చేయాలి – ఓఎన్‌జీసీ కార్యాలయం రాజమండ్రికి తరలించాలి

రాజమండ్రి, జనవరి 12:

పచ్చని కోనసీమ ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ అవసరాలు మరియు అవినీతి దాహం కోసం సర్వనాశనం చేస్తున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. కేజీ బేసిన్ సంపదలో ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా రావాల్సిన 50 శాతం వాటాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రాజమండ్రిలోని ఆర్‌పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో పాశర్లపూడి బ్లో అవుట్, నగరం ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవించగా, తాజాగా ఇరుసుమండలో మరో బ్లో అవుట్ జరగడం కోనసీమ ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇరుసుమండలో వంద అడుగులకుపైగా ఎగసిపడిన అగ్నికీలకాలను చూసి ప్రజలు భయాందోళనలకు గురై, పిల్లలను ఎత్తుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారని తెలిపారు.

ఈ తరహా ప్రమాదాల వెనుక అధికారులు, ప్రైవేట్ మాఫియా కుమ్మక్కు ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. కేజీ బేసిన్ ఖనిజ సంపదను లక్షల కోట్ల విలువలో దోచుకుంటూ, కోనసీమ పర్యావరణాన్ని విషతుల్యంగా మార్చుతున్నారని ఆరోపించారు. గాలి, నీరు తీవ్రంగా కలుషితమై ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, మరణాల వరకూ పరిస్థితి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

12వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేజీ బేసిన్ సంపదలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50 శాతం వాటా కేటాయించాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. ఈ హక్కుల కోసం పార్లమెంట్‌లో గట్టిగా ప్రశ్నించే ప్రజాప్రతినిధులు లేకపోవడం రాష్ట్ర దురదృష్టమని వ్యాఖ్యానించారు.

కోనసీమ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత అభివృద్ధి, హక్కుల కోసం ఇప్పటివరకు పోరాడలేదని విమర్శించారు. ప్రమాదాల తర్వాత సొల్లు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టడమే వారి రాజకీయమని ఆరోపించారు. కేజీ బేసిన్ అవినీతిలో అధికారులు, ప్రైవేట్ మాఫియా కీలక పాత్ర పోషిస్తూ కోనసీమను అగ్నిగుండంగా మార్చే కుట్ర చేస్తున్నారని అన్నారు.

బావుల్లో అపారమైన గ్యాస్, క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ, బావులు ఖాళీ అయ్యాయని తప్పుడు నివేదికలు సమర్పిస్తూ నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు సాగిస్తున్నారని మేడా శ్రీనివాస్ ఆరోపించారు. కేజీ బేసిన్ కార్యకలాపాలకు సంబంధించిన ఓఎన్‌జీసీ పరిపాలనా కార్యాలయాలు చెన్నైలో ఉండటం విడ్డూరమని, వాటిని తక్షణమే రాజమండ్రికి తరలించాలని డిమాండ్ చేశారు. అలాగే ఓఎన్‌జీసీ ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్ యువతకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు.

కేజీ బేసిన్ నుంచి తీసుకుపోతున్న గ్యాస్ వనరులను ఇతర రాష్ట్రాల రాజకీయ అవసరాలకు వినియోగిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా రావాల్సిన వాటాను వసూలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించేలా వంట గ్యాస్ సిలిండర్‌ను రూ.200కే సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఈ సమావేశానికి ఆర్‌పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డి.వి.ఆర్. మూర్తి, సిమ్మా దుర్గారావు, కారుమూరి యుగంధర్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, మాసా అప్పాయమ్మ, చల్లా సాంబశివరావు, కాకర్ల ప్రసాద్, చల్లా అఖిల్, సుంకర వెంకట బాస్కర రంగారావు, కందివలస రమణ, కూరాకుల నాగమణి తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......