;

విశాఖలో ఘనంగా వడ్డే ఓబన్న వేడుకలు..

news

విశాఖలో ఘనంగా వడ్డే ఓబన్న వేడుకలు..

విశాఖపట్నం:

స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి బిడ్డ వడ్డే ఓబన్న జయంతిని విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం నగరంలోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూయ మధుసూదన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులపై పోరాడిన వీరయోధుడు వడ్డే ఓబన్న స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్ర్యానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వడ్డే ఓబన్న త్యాగాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు పాల్గొని వడ్డే ఓబన్నకు ఘన నివాళులు అర్పించారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......