;

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులనే గెలిపించాలి - కోడూరి చంద్రయ్య పిలుపు

news

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులనే గెలిపించాలి

- కోడూరి చంద్రయ్య పిలుపు

మంచిర్యాల జిల్లా, ఖానాపూర్ ఆర్సీ, జనవరి 06:
బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు కోడూరి చంద్రయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సరైన పద్ధతిలో ప్రవేశపెట్టకపోవడం, షెడ్యూల్–9లో బీసీ బిల్లును చేర్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరమన్నారు.

రాష్ట్రంలోని అన్ని పార్టీల ప్రతిపక్ష నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ తీసుకుని బీసీ రిజర్వేషన్ల సాధనకు ప్రయత్నించాల్సి ఉండగా, ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలను రిజర్వేషన్లు లేకుండానే నిర్వహించడం ద్వారా బీసీ కులాలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అయినప్పటికీ బీసీ సమాజం చైతన్యవంతమై సుమారు 50 శాతం వరకు బీసీ సర్పంచులు, వార్డు మెంబర్లను గెలిపించుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు.

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను అన్ని జనరల్ నియోజకవర్గాల్లో ఓడించి, బీసీ అభ్యర్థులను గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బీసీ కులాలవారు ఐక్యమత్యంతో ఉద్యమంలో పాల్గొని రిజర్వేషన్ల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ కులాలను అగ్రవర్ణాల ఆధిపత్యం ద్వారా నిరంతరం అణిచివేస్తూ, రిజర్వేషన్లు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల విజయంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రకటించడానికి వెనుకడుగు వేసిందని వ్యాఖ్యానించారు. ఇది బీసీ సమాజం సాధించిన విజయం అని ఆయన అన్నారు.

ఈ ఐక్యమత్యం, చైతన్యాన్ని కొనసాగిస్తూ అగ్రవర్ణాల అణచివేత ధోరణిని తిప్పికొట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో–కన్వీనర్ కడార్ల నరసయ్య, జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్, పొనకల్ గ్రామ వడ్డెర సంఘం అధ్యక్షుడు కుంట మహేష్, వడ్డెర సంఘం నాయకుడు కుంట సాలయ్య, రిటైర్డ్ టీచర్ సీలోజు రాజబాబు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కంచి నరసయ్య, కట్ట వెంకటేశ్వర్లు, శ్రీరాముల ఆంజనేయులు, మైనారిటీ నాయకుడు షేక్ మజార్ తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......

🆕 Latest News

సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్

కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......

🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!

🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......

డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !

భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......