ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణానికి పిలుపు - రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణానికి పిలుపు
అభ్యుదయవాదులను ఆహ్వానించిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
రాజమండ్రి, జనవరి 7:
రాజకీయ కాలుష్యానికి తావులేని నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ అన్నారు.
ఆంధ్రుల భవిష్యత్ కోసం ఆంధ్ర మాత కన్నీరు పెడుతోందని పేర్కొన్న ఆయన, రాష్ట్ర రాజకీయాల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యత కలిగిన నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. ఈ లక్ష్యంతోనే నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణానికి రూపకల్పన జరుగుతోందని తెలిపారు.
రాజకీయంగా ఉజ్వలమైన భవిష్యత్ కోసం, ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం సామాజిక స్పృహ గల అభ్యుదయవాదులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశ చరిత్రలో న్యాయవాదులు, జర్నలిస్టులు, యువతీ–యువకులు, విద్యావంతులైన మేధావులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ ఉద్యమాన్ని మరో స్వాతంత్ర్య పోరాటంగా భావించి స్వచ్ఛందంగా భాగస్వాములవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా పార్టీ నిర్మాణానికి సంబంధించిన బాధ్యతల వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కన్వీనర్లు, అలాగే రాష్ట్రంలోని 28 జిల్లాలకు అధ్యక్షులు మరియు కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహించేందుకు అర్హులైన వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఆలస్యం లేని త్యాగాలు అవసరమని పేర్కొన్న మేడా శ్రీనివాస్, ఈ మహోన్నత ఉద్యమంలో భాగస్వాములై రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆశక్తి గల వారు తమ పూర్తి వివరాలను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపవచ్చని తెలిపారు.
ప్రధాన కార్యాలయం: డోర్ నెం. 12-11-113, ఆర్యాపురం, అర్పిసి వీధి (ఆర్పిసి భవన్), రాజమండ్రి – 533104, తూర్పు గోదావరి జిల్లా.
సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్: 9248777222.
జై ఆంధ్రప్రదేశ్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన నినదించారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......