;

గ్రామ సభలో కీలక చర్చలు: పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన పథకం & 125 రోజుల ఉపాధి

news

సోమయాజులపల్లె (ఓర్వకల్ మండలం), కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్, జనవరి 5:

సోమయాజులపల్లె గ్రామంలో సోమవారం నిర్వహించిన గ్రామ సభలో పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన (VB-GRAM) అమలు, సోషల్ ఆడిట్, కొత్త లబ్ధిదారుల చేర్పు–తొలగింపు, అలాగే ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

గ్రామస్తులు, సచివాలయ బృందం మరియు అధికారులు ఒకే వేదికపై సమూహంగా సమావేశమై, పథకం అమలులో పారదర్శకత, లెక్కల సరిచేయడం, పనుల నాణ్యతపై దృష్టి పెట్టారు. ప్రత్యేకంగా సోషల్ ఆడిట్ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆడిట్‌లో లెక్కలు, కూలీల హాజరు, పద్ధతిగల పనుల అమలును పరిశీలించినట్లు తెలిపారు.

గ్రామస్తులు, మహిళలు, యువత ఈ సభలో చర్చించిన అంశాలను సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులను జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్ల తొలగించడం ద్వారా పథకం ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధి కల్పించాలన్న ప్రతిపాదనను ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని గ్రామ సభలో నిర్ణయించారు.ఈ గ్రామ సభలో చర్చించిన అంశాలు 3 జనవరి న ఎటువంటి వేదికపై కూడా బహిర్గతం కాలేదని స్పష్టం చేశారు. గ్రామస్తుల సమక్షంలోనే చర్చలు జరుగుతున్నాయి మరియు ప్రజల సమ్మతితో తీర్మానాలు నమోదు చేయబడ్డాయి.సమావేశానికి సర్పంచ్ శ్రీమతి జయమ్మ గారు అధ్యక్షత వహించారు. గ్రామ పెద్దలు, మహిళలు తెలుగు లక్ష్మీదేవి గారు, లింగమ్మ గారు, సావిత్రి గారు, రామకృష్ణమ్మ గారు, బీబీ గారు, టి. లక్ష్మీ దేవమ్మ గారు పాల్గొన్నారు.

యువత తరఫున మల్లికార్జున్ (ఆర్థిక శాస్త్రవేత్త), బి. రవికుమార్ గారు, బి. రమణ గారు, ఎం. భాస్కర్ గారు హాజరయ్యారు.గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ రెడ్డి,VB-GRAM టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ నారాయణ, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

తీర్మానాలు:

గ్రామ సభలో చర్చించిన అంశాలు గ్రామ అభివృద్ధి దిశలో సార్వజనిక పారదర్శకత, సమగ్రత మరియు ప్రజల చైతన్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......