;

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్

news

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం కావడం ఉత్తరాంధ్ర ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. ఈ చారిత్రక ఘట్టం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిలో కీలక మైలురాయిగా మారనుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2014–2019 మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణం ప్రస్తుతం తుదిదశకు చేరుకుంది. మొత్తం పనుల్లో మిగిలిన కేవలం 4 శాతం పనులు కూడా ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి విమానాశ్రయాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. కేవలం 18 నెలల వ్యవధిలోనే పనులను వేగవంతంగా పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.

ఈ ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు సాగేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి జాతీయ, అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, నేషనల్ హైవేలు, ఐటీ రంగం సహా వివిధ విభాగాల్లో అంతర్జాతీయ సంస్థల రాకతో పరిశ్రమల అభివృద్ధి వేగం పుంజుకోనుంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరిగి, యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఈ శుభసందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేశారు.

📎 Similar News

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......

సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ

రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు

కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......