చచ్చినా బతికినా తెలంగాణ కోసమే - సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రకటన
చచ్చినా… బతికినా… తెలంగాణ కోసమే -శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రకటన
తెలంగాణ శాసనసభలో ‘నీళ్లు – నిజాలు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఆవేశంగా మాట్లాడినప్పటికీ తన ఆలోచన ఒక్కటేనని, తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని స్పష్టంగా ప్రకటించారు.
చిన్న వయసులోనే దేవుడు తనకు సీఎం బాధ్యత అప్పగించాడని పేర్కొన్న రేవంత్ రెడ్డి, ఇది సాధారణ విషయం కాదని, దేవుడిచ్చిన గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ఈ కుర్చీలో ఉన్నంతకాలం తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయనని దేవుడిపై ప్రమాణం చేశారు.
కృష్ణా జలాలు, రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, జల వివాదాలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గత ప్రభుత్వ నిర్ణయాలపై సవివరమైన సమాచారం సభ ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలంగాణలో ప్రారంభమైన ప్రాజెక్టుల వివరాలను పత్రాలతో సహా వివరించి, గత ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కుల కోసం సరైన పోరాటం చేయలేదని విమర్శించారు.
“నాకు ముందుగా నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాత నాయకుడు” అని స్పష్టం చేసిన సీఎం, సీఎం కుర్చీలో ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా ఎప్పటికీ ప్రవర్తించనని తేల్చిచెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేసిన చరిత్ర తమదేనని గుర్తు చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును మొదటి దశలో 45 టీఎంసీలు, రెండో దశలో మరో 45 టీఎంసీలతో పూర్తి చేయాలన్న సంకల్పాన్ని వెల్లడించారు. తొలి విడతకు అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరామని, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ నుంచి నీటి కేటాయింపులు సాధించి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
“చచ్చినా… బతికినా… తెలంగాణ కోసమే. తెలంగాణ హక్కులను ఎవరు భంగం కలిగించినా నిటారుగా నిలబడి కొట్లాడుతా” అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర చర్చకు దారి తీశాయి. తెలంగాణ నీటి హక్కులు, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయదన్న సంకేతంగా ఈ ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
సముద్రానికి కొత్త జీవం పోసిన శాస్త్రవేత్త... కేరళ ప్రభుత్వ గౌరవానికి పాత్రుడైన డా. జో కే. కిజకుడన్
కొన్ని విజయాలు కళ్లకు కనిపిస్తాయి. మరికొన్ని చరిత్రలో నిలిచిపోతాయి. కానీ అరుదుగా కొన్ని విజయాలు సముద్ర గర్భంలో పుడతాయి. వాటి ప్రభావం మాత్రం తరతరాల జీవనోపాధులను, ప్రకృతి సమతౌల్యాన్ని, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అలాంటి అరుదైన విజయగాథ వెనుక నిలిచిన శాస్త్రవేత్త డా. జో కే. కిజకుడన్.🏛️ మత్స్య......
🇮🇳🧘 భారతీయులారా… చరిత్ర సృష్టించే మహా అవకాశాన్ని చేజారనివ్వకండి!
🔥 గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో భాగస్వాములు కండి! 🔥యోగం కేవలం శారీరక వ్యాయామం కాదు; అది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దారి చూపే భారతీయ ఋషుల మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వం.ప్రపంచానికి శాంతి, సామరస్యం, ఆత్మజ్ఞానం, విశ్వబంధుత్వం అనే సందేశాన్ని అందించిన యోగ సంప్రదాయాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే......
డ్రగ్స్ వ్యసనం: భారత యువతపై నిశ్శబ్ద ముప్పు — భవిష్యత్తుకు గంభీర హెచ్చరిక !
భారతదేశంలో యువతపై మాదక ద్రవ్యాల వ్యసనం తీవ్రంగా విస్తరిస్తోందని తాజా నివేదికలు, నిపుణుల విశ్లేషణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారు ఉండగా, ఇదే వర్గం ఇప్పుడు డ్రగ్స్ మాఫియా ప్రధాన లక్ష్యంగా మారిందని తెలుస్తోంది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, డ్రగ్ వ్యసనం ఇప్పు......