వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు
సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు
విజయవాడ:
అక్షరాలే ఆయుధంగా, సమానత్వమే లక్ష్యంగా భారతదేశంలో మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫూలే గారి జయంతిని పురస్కరించుకుని విజయవాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించి, నిమ్న వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక సంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. మహిళా విముక్తికి విద్యే ప్రధాన ఆయుధమని విశ్వసించిన ఆమె, తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి 1848 జనవరి 1న పుణెలో దేశంలో తొలి బాలికల పాఠశాలను ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు. కులవ్యవస్థ నిర్మూలన, మహిళలకు సమాన హక్కుల కోసం ఈ దంపతులు చేసిన పోరాటం సమాజానికి మార్గదర్శకమని తెలిపారు.
అలాగే సావిత్రిబాయి ఫూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని అన్నారు. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారికి సామాజిక గుర్తింపు తీసుకువచ్చిన ఘనతను ఆయన గుర్తు చేశారు.
ఈ సందర్భంగా సంస్కృత–తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కె. కమల గారికి, నిట్టా లక్ష్మి కామేశ్వరి గారికి ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మల్కాపురం కనకారావు, ఎన్టీఆర్ జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు ముండూరి సత్యవతి, నగర బీసీ మహిళా అధ్యక్షురాలు నెల్లూరి లక్ష్మి చైతన్య, కుసుమ, పద్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
📎 Similar News
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన బీజేపీ ఓబీసీ మోర్చా – సామాజిక సమానత్వానికి నూతన దిశ
భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే (Mahatma Jyotirao Phule) జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం సామాజిక చైతన్యాన్ని బలపరిచే సానుకూల కార్యక్రమంగా భావించబడుతోంది.మహాత్మా జ్యోతిరావు ఫూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులుగా నిలిచ......
సోమయాజులపల్లిలో పట్టాదార్ పాసుపుస్తకాల పంపిణీ
రైతుల భూహక్కులను బలపర్చడానికి మరియు వచ్చే వ్యవసాయ సీజన్ ముందు సౌకర్యాన్ని అందించడానికి MLA గౌరు చరితా రెడ్డి గారి నేతృత్వంలో Pattadar Passbooks పంపిణీ కార్యక్రమం సోమయజుల పల్లెలో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమంలో గ్రామీణ రైతులు, మహిళా రైతులు, మరియు మండల అధికారులు పాల్గొన్నారు. తెలుగు లక్ష్మీ దే......
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ పత్రిక సమావేశం – ముఖ్యాంశాలు
కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ మరియు ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్థ రామాంజనేయులు పాల్గొన్న పత్రిక సమావేశం విజయవంతంగా జరిగింది.సమావేశంలో ప్రధానంగా చర్చించబడిన అంశం: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ – ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సాటిలేని అధ్యాయం.సమావేశం......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......