ఏపీలో బీసీలపై దాడి చేస్తే జైలు తప్పదు
ఏపీలో బీసీలపై దాడి చేస్తే జైలు తప్పదు
ముందస్తు బెయిల్ లేదు.. 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష
‘ఏపీ బీసీ రక్షణ చట్టం’ ముసాయిదా సిద్ధం4
Andhra Pradeshలో బీసీలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, సామాజిక బహిష్కరణలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఏపీ బీసీ రక్షణ చట్టం (AP BC Protection Act)’ ముసాయిదాను రూపొందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టాన్ని తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఈ ముసాయిదా చట్టం ప్రకారం, బీసీలపై సామాజిక బహిష్కరణ, కులం పేరుతో అవమానాలు, దాడులు, వేధింపులు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించనున్నారు. మొదటిసారి నేరానికి పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. అదే నేరం పునరావృతమైతే, కనీసం ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కోర్టు అవసరమైతే శిక్షను మరింత పెంచవచ్చు.
బీసీలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్‌కు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఈ ముసాయిదా న్యాయశాఖ సమీక్షలో ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ ఆమోదం పొందిన అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా తీసుకురానున్నారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే, బీసీలపై జరిగే ఎట్రాసిటీ కేసుల విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. అవసరమైతే సెషన్స్ కోర్టులనే ప్రత్యేక న్యాయస్థానాలుగా నియమించనున్నారు. చార్జిషీట్ దాఖలు చేసిన తేదీ నుంచి రెండు నెలల్లో కేసు పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రత్యేక కోర్టుల తీర్పుపై అసంతృప్తి ఉంటే, 90 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించనున్నారు. అవసరమైతే ఈ గడువును గరిష్ఠంగా 180 రోజుల వరకు పొడిగించవచ్చు. ఈ కేసుల విచారణకు కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులను నియమించనున్నారు.
బీసీలపై జరిగిన నేరాలకు సంబంధించి ఫిర్యాదులు స్వీకరించడంలో, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో లేదా 60 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తే, వారికి కనీసం 6 నెలల నుంచి గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు.
ఈ చట్టం ద్వారా బాధితులు, సాక్షులకు ప్రభుత్వ రక్షణ కల్పించనున్నారు. వారికి భద్రతతో పాటు కేసు విచారణ సమయంలో అయ్యే ప్రయాణ, భోజన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. బాధితుల పునరావాసానికి అవసరమైన సామాజిక, ఆర్థిక సహాయాన్ని కూడా అందించనున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై కోర్టు ఎప్పటికప్పుడు సమీక్ష చేయనుంది.
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......