;

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మార్గదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్

news

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మార్గదర్శి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

రాష్ట్ర నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్

తోటపల్లి గూడూరు,నెల్లూరు జిల్లా, డిసెంబర్ 17 :

తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా, కార్యకర్తలకు మార్గదర్శిగా నిలుస్తున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమించిన శుభసందర్భంగా రాష్ట్ర నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అల్తాఫ్ తన సహచరులతో కలిసి ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా షేక్ అల్తాఫ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడుకుంటూ కష్టకాలంలోనూ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీకి వన్నె తెచ్చిన ఆయన, కార్యకర్తలకు ఎల్లప్పుడూ మార్గదర్శిగా నిలిచారన్నారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేసే నాయకుడిగా బీద రవిచంద్ర సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అధిష్టానంపై నమ్మకంతో, పార్టీ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పని చేస్తే పదవులు సహజంగానే వస్తాయని నిరూపించిన నేత బీద రవిచంద్ర అని పేర్కొన్నారు. ఆయన బాటలో పార్టీ క్యాడర్ మరింత విజయవంతంగా పయనించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నూర్ భాషా దూదేకుల సంఘం సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......