;

తెలంగాణలో బీసీ రాజకీయ ఐక్యతకు అఖిలేష్ యాదవ్ పర్యటన – ఘన స్వాగతం తెలిపిన బేరి రామచంద్ర యాదవ్

news

తెలంగాణలో బీసీ రాజకీయ ఐక్యతకు అఖిలేష్ యాదవ్ పర్యటన

– ఘన స్వాగతం తెలిపిన బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంపల్లి,

బీసీ రాజకీయ ఐక్యత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్‌కు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసేలా సమైక్యత యాత్ర చేపట్టాలని, బీసీ రిజర్వేషన్లు, బీసీ డిక్లరేషన్, బీసీ కులగణన అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తీసుకురావాలని అఖిలేష్ యాదవ్‌ను కోరారు.

అఖిలేష్ యాదవ్ తన తెలంగాణ పర్యటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై బీసీ రాజకీయ ఐక్యతపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యంగా నిలబడి బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పోరాటం చేయాలని బేరి రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.

దీనికి స్పందించిన అఖిలేష్ యాదవ్, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ ముఖ్యమంత్రి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, బీసీ ఉద్యమానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీలను సంఘటితం చేసి అసెంబ్లీ, పార్లమెంటులలో కనీసం 50 శాతం ప్రాతినిధ్యం సాధించే దిశగా స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు నేతలు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, మందాడి అనిల్ కుమార్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు బీసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......