;

తెల్లాపూర్ అమరుడు సాయి ఈశ్వర చారికి బీసీ ఐక్యవేదిక తరఫున ఘన నివాళులు

news

తెల్లాపూర్ అమరుడు సాయి ఈశ్వర చారికి బీసీ ఐక్యవేదిక తరఫున ఘన నివాళులు

పఠాన్‌చేరు, డిసెంబర్ 08 :

తెల్లాపూర్ బీసీ సంఘం ఆధ్వర్యంలో, మాజీ ఉప సర్పంచ్ ఎన్. కృష్ణ అధ్యక్షతన గద్దర్ సర్కిల్ వద్ద అమరుడు సాయి ఈశ్వర చారికి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, అమరుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సాయి ఈశ్వర చారి కుటుంబంలోని పిల్లల విద్య ఖర్చులు ప్రభుత్వం భరించాలని, కుటుంబంలోని ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలి అని రామచందర్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వాలు బీసీలను వరుసగా మోసం చేశాయని ఆయన విమర్శించారు.

మాజీ ఉప సర్పంచ్ ఎన్. కృష్ణ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా నిలిచి తమ ఓటుతో శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. వడ్డే నరసింహులు మాట్లాడుతూ, బీసీ యువత నిరాశకు గురికాకుండా హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సాయన్న, మాజీ సర్పంచ్ పి. కుమార్ గౌడ్, వడ్డే నరసింహులు, మాజీ కౌన్సిలర్లు భరత్, శ్రీశైలం, చిలకమర్రి ప్రభాకర్ రెడ్డి, ఎల్. రవీందర్, ఐలేష్ యాదవ్, కంజర్ల కృష్ణమూర్తి చారి, రాగం రమేష్ యాదవ్, జర్నలిస్ట్ కృష్ణ, వంగూరు శ్రీనివాస్ యాదవ్, నర్సింగ్ ముదిరాజ్, విజయలక్ష్మి, హరికృష్ణ చారి, అందేలా కుమార్ యాదవ్, శివా యాదవ్, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు అమరుడు సాయి ఈశ్వర చారికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......