;

రిజర్వేషన్లను 52 శాతానికి పెంచి రాజ్యాంగ సవరణ చేయాలి – బీసీ జేఏసీ

news

రిజర్వేషన్లను 52 శాతానికి పెంచి రాజ్యాంగ సవరణ చేయాలి – బీసీ జేఏసీ

కాచిగూడ, డిసెంబర్ 7: పంచాయతీరాజ్ వ్యవస్థలో బీసీ రిజర్వేషన్లను ప్రస్తుత 22 శాతం నుంచి 52 శాతానికి పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీసీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లలో రాజ్యాంగబద్ధమైన మార్పులు చేయాలని కోరుతూ, గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలోని బృందం ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించింది.

తరువాత మీడియాతో మాట్లాడుతూ గుజ్జ కృష్ణ, బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో దశాబ్దాలుగా వివిధ ప్రధాన మంత్రులు దేశాన్ని పాలించినా, బీసీల జీవన స్థితిలో పెద్ద మార్పు రాలేదని, “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్నట్లు పరిస్థితి నడుస్తోందని వ్యాఖ్యానించారు.

బీసీలు సంఘటితమై, తమ హక్కుల కోసం ఒక గొంతుకగా నిలబడాల్సిన సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నందగోపాల్, ఉదయ్ నేత, కె. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

📎 Similar News

💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”

ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......

🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"

ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......

జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు

జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......

🆕 Latest News

🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు

జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......

యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !

వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......

నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!

ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......