బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై..ఆవేదనతో యువకుడు ఆత్మహత్యాయత్నం!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై..ఆవేదనతో యువకుడు ఆత్మహత్యాయత్నం!
తీన్మార్ మల్లన్న కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్య యత్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆవేదన
గాంధీ ఆసుపత్రికి తరలించిన మేడిపల్లి పోలీసులు, పరిస్థితి విషమం
మేడిపల్లి, నేడు ప్రతినిధి: బీసీ రిజర్వేషన్లపై ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆ యువకుడు ఆవేదన చెందాడు. సాయి ఈశ్వర్(35) అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పూనుకున్నాడు. పీర్జాదిగూడ నగర పరిధిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పోచారం గ్రామానికి చెందిన సాయి ఈశ్వర్ డ్రైవర్
గా పని చేస్తూ బ్రతుకుతెరువు కోసం తన భార్య కవిత ముగ్గురు పిల్లలతో కలిసి నగరంలోని జగద్గిరిగుట్ట మద్దూర్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. గురువారం సాయంత్రం పీర్జాదిగూడలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయానికి వచ్చాడు. మల్లన్నను కలవాలని సిబ్బందికి తెలియజేశాడు. ప్రస్తుతం మల్లన్న అందుబాటులో లేడని, రేపు ఉదయం రావాలని అక్కడి సిబ్బంది చెప్పి పంపించారు. దీంతో
కిందకు వచ్చిన సదరు యువకుడు క్యూ న్యూస్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకున్నాడు. వెంటనే స్థానికులు మంటలు అర్పేందుకు యత్నించడంతో పాటు ఫైర్ ఇంజన్, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే తీవ్రంగా గాయపడిన యువకుడు సాయి ఈశ్వర్ ను మేడిపల్లి పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ సాయి ఈశ్వర్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న యువకుడు సాయి ఈశ్వర్ ను పరామర్శించేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్ళి, ఆత్మహత్య యత్నానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు: నారగోని
బీసీలకు చట్టసభలలో స్థానిక సంస్థలలో ఉద్యోగాలలో తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ నాయకుడు నాగగొని ప్రవీణ్ అన్నారు. ఈ పరిస్థితిలోనే అసంతృప్తితో సాయి ఈశ్వర్ అనే యువకుడు ఒంటిమీద పెట్రోల్ పోసుకొని కాల్చుకోవటం జరిగిందని తెలిపారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అన్నారు. యువకులు ఇలాంటి సంఘటనలకు పాల్పడవద్దని ఆయన పిలుపునిచ్చారు.
📎 Similar News
💧 “ఒక ఇంజనీర్ మార్పుతో ఎడారిలా ఉన్న నేలే పంటల సముద్రంగా మారింది… ఎవరో తెలుసా?”
ఆర్థర్ కాటన్ – ఆంధ్రప్రదేశ్ రైతుల జీవితాన్ని మార్చిన మహా ఇంజనీర్సర్ ఆర్థర్ థామస్ కాటన్ (1803–1899) ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ, ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయనను కేవలం ఒక అధికారి లేదా ఇంజనీర్‌గా కాకుండా, “జలవనరుల రూపకర్త”గా, “రైతుల మిత్రుడిగా” భావిస్......
🌍 "పర్యావరణ న్యాయం కోసం విద్యార్థుల గొంతు... పెద్దలను ఆశ్చర్యపరిచిన చిన్నారుల ఆలోచనలు!"
ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు మియాపూర్‌లోని మాతృశ్రీనగర్‌లో ఉన్న PSS ట్రస్ట్ విద్యార్థులకు EJF (Environmental Justice Forum) ఆధ్వర్యంలో జూనియర్ మరియు సీనియర్ విద్యార్థుల కోసం వక్తృత్వ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.“పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర, పేదలు–బలహీన వర్గాలు......
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరలేదు: ఢిల్లీ పోలీసులు
జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించేందుకు డిజిటల్ సంస్థ Cockroach Janta Party (CJP) నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనుమతి అభ్యర్థన అందలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.“వారు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు పరిశీలిస్తాం,” అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఇక పరిస్థితిని పోలీసులు నిశితంగా......
🆕 Latest News
🎣🐟 జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సోమయాజుల పల్లె గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకలు
జూలై 10వ తేదీ జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా సోమయాజుల పల్లె గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ బి గారు, నరేష్ బాబు బి గారు, రాఘవేంద్ర గారు, టి. వెంకట రమణ (పెద్ద) గారు, టి. హనుమన్న గారు, టి. శివాం......
యోగం: గ్రామ జీవనంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు శాశ్వత మార్గం !
వేగవంతమైన జీవనశైలిలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, శారీరక అనారోగ్యాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషి తన శరీరాన్ని, మనసును సమతుల్యంలో ఉంచుకోవడానికి సహజమైన, శాస్త్రీయమైన మార్గం యోగం.Yoga కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు; అది శరీరం, మనసు, శ్వాస మరియు చైతన్యాన్ని సమన్వయం చేసే సంపూర్ణ జీవన విధాన......
నీ కలలు కూడా ముందుగా కనేది… నాన్నే!
ఈ లోకంలోకి అడుగుపెట్టకముందే నీ రాక కోసం ఆత్రంగా ఎదురుచూసినవాడు… నీ చిన్న పాదాల చప్పుడు కోసం కలలు కన్నవాడు… నీ భవిష్యత్తుకు రంగులు అద్దినవాడు… అతడే — నాన్న.నువ్వు పుట్టిన ఆ క్షణంలో మొదటిసారి నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ గుండె నిండిన ఆనందానికి మాటలు లేవు. నీ చిన్న నవ్వులోనే తన ప్రపంచాన్ని చూ......